YSR Congress Party chief YS Jaganmohan Reddy's public meeting in Allagadda on Wednesday evening. Huge response to Jagan from people. it may give shock to tdp and akhila priya
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి కర్నూలు జిల్లాలో ప్రజలు నీరాజనాలు పలికారు. ఆళ్లగడ్డలోను పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన అఖిలప్రియకు ఇది తొలి ఝలక్ అంటున్నారు.
జగన్ బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చేరుకున్నారు. కార్యకర్తలు, అభిమానులు ఆయనకు నీరాజనం పలికారు. జగన్‌ను చూసేందుకు వచ్చిన జనంతో ఆళ్లగడ్డ పట్టణం కిక్కిరిసింది. నలువైపులా పెద్ద ఎత్తున జనం కనిపించారు. జగన్ సభకు అంతమంది రావడాన్ని టీడీపీ కూడా జీర్ణించుకోలేకపోతోందట.
జగన్‌తో కరచాలనాలు చేసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీ పడ్డారు. జగన్ వారిని పలకరిస్తూ ముందుకు పోయారు. అనంతరం ఫోర్ రోడ్ జంక్షన్‌కు చేరుకొని మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఎవరూ సంతోషంగా లేరని, రైతులకు గిట్టుబాటు ధర లేక అవస్తలు పడుతున్నారని అందుకే పాదయాత్ర మొదలు పెట్టానని చెప్పారు.