Air Balloon Festival @Araku Valley : Video

2017-11-16 64

People across the world thronged Visakhapatnam to participate in a Hot Air Balloon festival. The skies of the Araku valley were dotted with colourful hot air balloons as balloonists showcased their skills. Balloonists from around 14 countries, including the United States, Switzerland, Japan, Malaysia and Taiwan are participating in the event.

అందాల అరకు లోయ మరో అరుదైన వేడుకకు వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తలపెట్టిన బెలూన్ ఫెస్టివల్ కన్నుల పండుగగా సాగుతోంది. పర్యాటకుల్ని ఆకర్షించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అరకు లోయలో ఈ బెలూన్ ఫెస్టివల్ ని పర్యాటకశాఖ నేతృత్వంలో ఈ-ఫ్యాక్టర్‌ సంస్థ నిర్వహిస్తోంది.
నవంబర్ 14 న ప్రారంభమైన ఈ ఫెస్టివల్ 16 వ తారీఖు వరకు జరగనుంది. ఈ వేడుకల్లో ఆస్ట్రేలియా, అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్ తో సహా 13 దేశాలకు చెందిన 16 బెలూన్ పైలట్లు పాల్గొంటున్నారు. పోటీల్లో భాగంగా కొన్ని బెలూన్లను 5 వేల అడుగుల ఎత్తు వరకు తీసుకువెళతారు. ఈ బెలూన్‌ రెయిడ్స్‌లో పాల్గొన దలచిన వారు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్న ఈ-ఫ్యాక్టర్‌ సంస్థ సూచనతో ఇప్పటిదాకా దాదాపు 6500 మంది వరకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో లాటరి ప్రక్రియ ద్వారా ప్రయాణికులను ఎంపిక చేసి రోజుకు 300 మందిని ఉచితంగా బెలూన్లలో విహరించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు పర్యటక శాఖ అధికారులు చెప్పారు.