Andhra Pradesh cabinet reshuffle may in December. Chandrababu Naidu may induct some TDP joined YSRCP MLAs into cabinet.
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి క్యాబినెట్ లో భారీగా మార్పులు చేయబోతున్నారు!! డిసెంబర్ లో ఈ మార్పులు వుండే అవకాశం వుంది. ఎన్నికలు ఏడాదిలో వస్తున్నందున ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను, పార్టీ వాణి బలంగా వినిపించే వాళ్ళు క్యాబినెట్ లో వుండాలని చంద్రబాబు భావిస్తున్నారట.
అదే టార్గెట్ తో ఈసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వుండబోతోంది. అనంతపురం జిల్లా నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి,వెస్ట్ గోదావరి నుంచి చింతమనేని ప్రభాకర్, ఒంగోలు నుంచి గొట్టిపాటి రవికి మంత్రివర్గములో స్థానము కలిపించనున్నారట.చంద్రబాబు కుడిభుజం అనుకున్న పి నారాయణ మంత్రివర్గం నుంచి పక్కనబెట్టి పార్టీ కార్యక్రమాలకే పరిమితం చేసే అవకాశం ఉంది ఇక పార్టీలో బాగా సీనియర్ గా పేరుండి, చంద్రబాబు దగ్గరకు ఎప్పుడైనా వెళ్లగలిగే స్థాయి వున్న ఎనమల రామకృష్ణడు ని కూడా క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశం వుంది. ఈయనకు రాజ్య సభ ఛాన్స్ దక్కుతుందట.
ఇక పార్టీ లో ఫైర్ బ్రాండ్ గా పేరు పడ్డ చింతమనేని ప్రభాకర్ కు క్యాబినెట్ లో అవకాశం ఈయన వివాదాలకు దగ్గరగా ఉంటారని పేరు ఉన్నప్పటికీ పార్టీ అంశంలో అంకిత భావమే ఆయనకు ఛాన్స్ దక్కేలా చేస్తోందట.