AP AgTech Summit-2017 : Venkaiah Naidu & Chandrababu Speech

2017-11-16 163

M. Venkaiah Naidu on Wednesday inaugurated a three-day AP AgTech Summit-2017, organised by the Andhra Pradesh Government in Visakhapatnam. Watch Venkaiah Naidu & Chandrababu Speech at AgTech Summit

భారత పరిశ్రమల సమాఖ్య, బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీ అగ్రిటెక్‌ సదస్సు-2107ను బుధవారం విశాఖపట్నంలో ప్రారంభించింది. మూడు రోజులు జరిగే ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. సీఎం చంద్రబాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చిన్న రైతులకు మేలు చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి అందుబాటులోకి తేవడంపై దృష్టి పెట్టామన్నారు. ఏపీలో స్థూల జాతీయ ఉత్పత్తి 11.61 శాతం ఉందని, దీన్ని 15 శాతానికి తీసుకువెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. దేశంలో 13 శాతం సముద్ర తీరప్రాంతం కలిగిన ఏపీలో ప్రస్తుతం ఆరు పోర్టులు ఉండగా, కొత్తగా మరో ఎనిమిది పోర్టులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోఏంతో మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, వారందరికీ మేలు చేయడానికే ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు.