Tough to speak on workload. There's a lot of talk about whether players should be rested or not. Everyone played same number of games. But it's important to understand that not everyone had the same kind of workload in every game that you play. 20-25 players, you don't want important players breaking down at important times.
'నాకు కూడా రెస్ట్ కావాలి.. నేనేమీ రోబోను కాదు.. నా చర్మాన్ని కోస్తే రక్తమే వస్తుంది' ఈ వ్యాఖ్యలు అన్నది ఎవరో తెలుసా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. శ్రీలంకతో కోల్‌కతాలోన ఈడెన్ గార్డెన్స్ వేదికాగ గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ బుధవారం మీడియాతో మాట్లాడాడు.
నాకు అవసరమైనప్పుడు విశ్రాంతి అడుగుతా. ఓ ప్లేయర్ ఎంత పని భారాన్ని మోస్తున్నాడన్నదానిపై రెస్ట్ ఇవ్వడం ఆధారపడి ఉంటుంది. అది ఒక్కో ప్లేయర్‌కు ఒక్కోలా ఉంటుంది' అని కోహ్లీ అన్నాడు. అసలు కోహ్లీ నోటి వెంట ఈ సమాధానం ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా! ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఎందుకు అన్న ప్రశ్నపై కోహ్లీ పైవిధంగా స్పందించాడు. తన ఫిట్‌నెస్‌ను మళ్లీ మెరుగుపరుచుకునేందుకు పాండ్యాకు రెస్ట్ కోరాడని కోహ్లీ ఈ సందర్భంగా చెప్పాడు.