ఇది ఫ్యామిలీ సినిమా కాదు చూడకండి...!

2017-11-15 1

Bommarillu fame Siddharth's Latest movie is Gruham. Andrea Jeremiah, Anisha Victor, Atul Kulakarni are the lead actors. Horror and suspense movie directred by Milind Rau, Music scored by Girishh. This getting ready for release which Siddharh him self acted and produced.

''గృహం''తెలుగు సినిమా ప్రెస్ మీట్
హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన గృహం చిత్రంలో ఆండ్రియా జెర్మియా హీరోయిన్‌గా నటించింది. తమిళ్ ఘనవిజయం సాధించిన అవల్ చిత్రం తెలుగులో గృహంగా విడుదలవుతున్నది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ మీడియాతో ముచ్చటించారు. గృహం చిత్రం గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి సిద్దార్థ్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..గృహం చిత్రం వాస్తవ కథతో రూపొందించాం. హారర్ చిత్రాలంటే కామెడీగా మారిన ఈ రోజుల్లో ఒక మంచి హారర్ చిత్రం చూశామనే సంతృప్తిని కలిగిస్తుంది. ఈ చిత్రం ప్రేక్షకుడిని భయపెట్టించడంతోపాటు మంచి అనుభూతిని ఇస్తుంది. కమర్షియల్ హంగులతో పాటు సామాజిక కోణం కూడా ఉండటం ప్రేక్షకులను సంతృప్తి పరిచే అంశం.
గృహం చిత్రం సకుటుంబంగా చూసే చిత్రం కాదు. పిల్లలు అసలే ఈ చిత్రం చూడకూడదు. పిల్లలను థియేటర్లకు అనుమతించకూడదు. ఈ చిత్రంలో నటించిన ఓ పాపను కూడా సినిమా చూడటానికి నేను ఒప్పుకోలేదు.
కుటుంబం అంతా వెళ్లడానికి ఈ చిత్రం గుడి కాదు. ఇది పక్కా హారర్ చిత్రం. మీరు ఈ మధ్యకాలంలో ఇలాంటి హారర్ చిత్రం చూసి ఉండరు. నేను సెన్సార్ బోర్డుకు ఏ సర్టిఫికెట్ ఇవ్వమని బలవంతం చేశాను. ఈ సినిమా అందరూ చూడాలని నేను ఆశపడటం లేదు. ఓ వర్గం ప్రేక్షకులు చూస్తే చాలు అనే ఫీలింగ్‌తో ఉన్నాను.