నేను అర్హుడినా ? కంటతడి పెట్టిన శివబాలాజీ

2017-11-15 1,803

Pawan Kalyan fans have been showering so much of love on Siva Balaji and there is a gossip that Pawan Kalyan shares a close relationship with the actor. Many fan pages of Pawan Kalyan are sharing the updates regarding Siva Balaji's New Movie "Snehamera Jeevitam"

శివ బాలాజీ నిర్మించి.. నటిస్తున్న సినిమా స్నేహమేరా జీవితం. ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఆర్య సినిమా లో సెకండ్ హీరోగా చేసినా.. "ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ" సినిమా లో స్ట్రైట్ హీరోగా చేసినా ఆ సినిమాల కంటే ఎక్కువ గుర్తింపు మొన్న వచ్చిన బిగ్ బాస్ షో తో వచ్చింది.
బిగ్ బాస్ సీజన్‌ 1తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన శివాబాలాజీ నిర్మాత‌గా మారి వెండితెర ప్రేక్ష‌కుల‌ను మెప్పించేందుకు సిద్ధ‌మవుతున్నాడు. కాట‌మ‌రాయుడులో ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడిగా న‌టించిన శివ‌బాలాజీ ఓ మ‌ల్టీ స్టార‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమాలో శివబాలాజీతో పాటు ప్రముఖ నటుడు రాజీవ్ క‌న‌కాల కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు.
ఈ మధ్య రిలీజైన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బాగానే చర్చనీయాంశమవుతోంది. 1982 నాటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడం విశేషం.
శివబాలాజీని పవన్‌ తన తమ్ముడిలా భావిస్తాడు. దీంతో పవన్ తమ్ముడిగా శివకు కూడా ఆయన అభిమానులు మద్దతు ఇస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుతూ.. సినిమా పోస్టర్‌కి హారతులిచ్చారు. ఈ వీడియోను చూసిన శివబాలాజీ ఆనందంతో పొంగిపోయారు.