Guj EC Bans Use Of Pappu In BJP Ad ‘పప్పు’పై ఎన్నికల సంఘం నిషేధం

2017-11-15 490

The Election Commission has barred the ruling BJP in Gujarat from using the word "Pappu" in an electronic advertisement, which apparently targeted Congress vice president Rahul Gandhi, calling it "derogatory".

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ప్రత్యర్థి పార్టీలు విమర్శించే సమయంలో 'పప్పు' అనే పదం వాడటం వారికి పరిపాటిగా మారింది. అయితే, తాజాగా, రాహుల్‌ను ఉద్దేశించి ప్రచార కార్యక్రమాల్లో 'పప్పు' అనే పదాన్ని వినియోగించడాన్ని గుజరాత్‌ ఎన్నికల కమిషన్‌ నిషేధించింది.
రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సందర్భంగా ఓ ఎలక్ట్రానిక్‌ ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాహుల్‌ను ఉద్దేశించి 'పప్పు' పదాన్ని వినియోగించడానికి ఈసీకి స్క్రిప్టును పంపింది.
స్క్రిప్టును పరిశీలించిన కమిషన్‌కు చెందిన కమిటీ ‘పప్పు' అనే పిలుపు అభ్యంతకరంగా ఉందని చెప్పింది. ఓ నాయకుడిని అలా పిలవడం ఆయన్ను అవమానించడమేనని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది.
ఎన్నికల కమిషన్‌ నిర్ణయంపై స్పందించిన గుజరాత్‌ బీజేపీ శ్రేణులు అడ్వర్టైస్‌మెంట్‌లో వినియోగించిన స్క్రిప్ట్‌ ఏ నాయకుడిని ఉద్దేశించి కాదని పేర్కొన్నాయి.

Videos similaires