బాహుబలి తర్వాత "సైరా" నే..

2017-11-14 1,433

The film, based on the life of India’s first freedom fighter Uyyalawada Narasimha Reddy and starring Chiranjeevi, will go on the floors in the first week of December.

చిరంజీవి కొత్త సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి షూటింగ్ ఎప్పుడు? ఈ సినిమాఎప్పుడు క్లాప్ కొట్టుకోనుంది? చిరు అభిమానులు ఆస‌క్తిగా చ‌ర్చించుకొంటున్న సంగ‌తులివి. ఈ విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చేసింది. డిసెంబ‌రు 6 నుంచి 'సైరా' రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. క‌ళా ద‌ర్శ‌కుడు రాజీవ‌న్ నేతృత్వంలో హైద‌రాబాద్ అల్యుమినియం ఫ్యాక్ట‌రీలో ఓ భారీ సెట్ తీర్చిదిద్దారు. ఆ సెట్ ప‌నులు పూర్తి కావొచ్చాయి.
మ‌రోవైపు కెమెరామెన్ ర‌త్న‌వేలు కూడా డిసెంబ‌రు మొద‌టి వారంలో ఖాళీ అవుతున్నాడు. అందుకే డిసెంబ‌రు 6న ‘సైరా'కి ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఆగస్టు 22న ఓపెనింగ్ జరిగిన ఈ చిత్రం ఇప్పటిదాకా షూటింగ్ కు సంబంధించిన కసరత్తులు చేస్తూనే ఉంది. తాజాగా రెగ్యులర్ షూటింగ్ కు డేట్ ఫిక్స్ చేశారు. మొద‌టి షాట్‌ని న‌ర‌సింహారెడ్డి గెట‌ప్‌లో ఉన్న చిరంజీవిపై చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచార‌మ్‌.
న‌య‌న‌తార‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్, విజ‌య్ సేతుప‌తి త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌నున్న ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించ‌నున్నారు. ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌నున్న ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నుంది.