రిసెప్షన్‌కు బాలయ్య డుమ్మా.. కారణం అదేనా?

2017-11-13 5,390

Balakrishna, Nagarjuna's differences become talk of the industry once again. Nagarjuna has conducted Naga Chaitanya, Samantha Marriage reception grandly on November 12th. But Balakrishna has not attended for the reception. So Once again this news become in viral in cine circles..

నాగార్జున, బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం మరోసారి తెరమీదకు వచ్చింది. నవంబర్ 12న జరిగిన నాగ చైతన్య, సమంత పెళ్లి రిసెప్షన్‌కు తెలుగు, తమిళ సినిమా ప్రముఖులందరూ తరలివచ్చారు. అయితే నందమూరి బాలకృష్ణ ఈ వేడుకలో కనిపించకపోవడంతో మళ్లీ వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే అంశం మరోసారి మీడియాలో నానుతున్నది.
టాలీవుడ్‌లో నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. కుటుంబ పరంగానూ, ఫ్యాన్స్ పరంగానూ ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకొన్నారు.
అదే సంప్రదాయాన్ని నాగార్జున, బాలకృష్ణ కొనసాగించారు. చాలా కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. పలు వేదికలపై కలిసి కనిపించారు. అయితే కొన్ని రోజులుగా నాగ్, బాలయ్య ఒకే వేదికపైన కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.