Hyderabad Metro : HYD మెట్రో తరువాతే ఏదయినా ! ఎందుకో తెలుసా ? | Oneindia Telugu

2017-11-13 2,394

Readying for Hyderabad Metro…Launch end of this month. Final touches,” the minister said in a tweet and posted some photos. In another tweet, Rao, who is also the Municipal Administration and Urban Development Minister, posted some more photos with a tweet “Pictures of Miyapur station & depot where the inaugural function is being planned.

మన రాజధాని మెట్రోరైల్‌ ప్రపంచంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు అని మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. మెట్రోరైల్‌ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు కేటాయించిందని, ఆ నిధుల్లో ఇప్పటికే 2,240 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి కేటీఆర్‌ శాసనసభలో తెలిపారు.
నవంబర్‌ 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకూ ప్రారంభమైన మెట్రోరైలు ప్రాజెక్టులు 11 కిలోమీటర్లకు మించలేదని.. హైదరాబాద్‌లో తొలిసారిగా 30కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభించడం ఓ రికార్డు అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి మెట్రోరైల్‌ ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తిచేస్తామన్నారు.ఎంఎంటీఎస్‌ రెండో దళ పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం వేగవంతం చేసిందని, రూ.817కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయని కేటీఆర్‌ తెలిపారు. ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ మార్గాన్ని విస్తరిస్తామన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పలు ఫొటోలను కూడా కేటీఆర్ పోస్టు చేశారు.మెట్రో రైలు విజయవంతం కావాలంటే టికెట్ ధరే కీలకమని ఓ నెటిజన్ అభిప్రాయపడగా.. అలా ఏం ఉండదని మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. అయితే, టికెట్ ధర మరి ఎక్కువగా, మరీ తక్కువగా ఉండదని, ప్రజలకు అందుబాటులోనే ధరలు ఉంటాయని చెప్పుకొచ్చారు.