Simbu Thanked His Fans For All The Support అలాంటివాటికి భయపడను

2017-11-13 259

The actorsinger who made headlines recently for singing the demonetisation song has thanked his fans for all the support through a video.

పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ పన్ను విధానాలను ఎక్కుపెట్టి వైరముత్తు కొడుకు కపిలన్‌ రాసిన పాటను పాడారు. అందులో పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ పన్ను విధానంతో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను, ఆ విధానాలకు వ్యతిరేకంగా నటులు రజనీకాంత్, కమలహాసన్‌ చేసిన వ్యాఖ్యలు పొందుపరచారు.
ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట ఇప్పుడు కలకలాన్ని సృష్టిస్తోంది. దీంతో నటుడు శింబుపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందని, ఆయనకు బెదిరింపులు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. తనకు ఎవరి నుంచి ఎటువంటి బెదిరింపులు రాలేదని నటుడు శింబు పేర్కొన్నారు.
చర్చనీయాంశ నటుల్లో శింబు ఒకరని చెప్పడంలో ఇసుమంత అతిశయోక్తి ఉండదు. ఆ మధ్య బీప్‌ సాంగ్‌ పాడి కేసులు, కోర్టులు అంటూ తిరిగిన ఈ హీరో తాజాగా అలాంటి వివాదాల్లోనే చిక్కుకున్నాడు. ఈ విషయంపై నటుడు శింబు తన ట్విట్టర్‌ ద్వారా ఆదివారం వివరణ ఇచ్చాడు.
పెద్ద నోట్లు రద్దు, జీఎస్‌టీ పన్ను విధానం లాంటి విషయాల్లో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను పాటలో పొందుపరచామని తెలిపాడు. అయితే ఈ పాటను రాసింది తాను కాదని, ఒక గాయకుడిగా తన బాధ్యతను మాత్రమే తాను నిర్వహించానని అన్నాడు. ఈ విషయంలో తనకెలాంటి బెదిరింపులు రాలేదని చెప్పాడు.