Boat Mishap : Chandrababu Naidu Statement In AP Assembly

2017-11-13 3

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu statement in AP Assembly on boat capsized in Vijayawada

విజయవాడలో పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. అక్కడే ఉన్న స్థానికులు పలువురిని కాపాడారని చెప్పారు. ఓ స్థానికుడు 9మందిని కాపాడారని తెలిపారు.
బోటులో మొత్తం 41 మంది ప్రయాణించారని చంద్రబాబు చెప్పారు. స్థానికులు, సిబ్బంది వెంటనే వెళ్లి 14 మందిని కాపాడారని తెలిపారు. ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. రివర్ బోటింగ్ సంస్థపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కొండల్రావు, గేదెల శ్రీను, విజయసారథి, చిట్టిబాబు సహా ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు.
పడవ ప్రమాదం దురదృష్టకరమన్నారు. ఇరవై మంది మృతి చెందారని, ఆసుపత్రిలో నలుగురు చికిత్స పొందుతున్నారని, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చంద్రబాబు చెప్పారు. ఇద్దరి ఆచూకీ గుర్తించాల్సి ఉందన్నారు. ఇద్దరు బోటు సిబ్బంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు.రివర్ బోటింగ్ సంస్థ బాధ్యతారాహిత్యం వల్ల ప్రమాదం జరిగిందని చంద్రబాబు చెప్పారు. బోటుకు అనుమతి లేదని చెప్పారు. డ్రైవర్‌కు అనుభవం కూడా లేదని చెప్పారు. టూరిజం అధికారులు చెప్పినా బోటును నడిపారన్నారు. కుదుపులకు లోను కావడంతో అందరు ఒకవైపు వచ్చారని, దీంతో బోటు తిరగబడిందన్నారు.