Trisha Krishnan is not very visible on social media these days. The reason behind her absence is her film Garjanai. Trisha was silently preparing for her role, for the first time in her career she has done action scenes. Trisha performed her own stunts
ఓ పదేళ్ల కిందట కోలీవుడ్ తెర మీద తళుక్కున మెరిసిన త్రిష అదే పదేళ్ల పాటు అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ అగ్రహీరోయిన్ స్థాయిలో మంచి ఊపునే కొనసాగించింది. మొదటినుంచీ త్రిష పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చింది కమర్శియల్ గా కలిసివచ్చే గ్లామర్ పాత్రలకే. నెమ్మదిగా కొత్త హీరోయిన్ల రాకమొదలై, త్రిష ఏజ్ కూడా పెరిగిపోతుండటంతో ఆఫర్లలో వెనుకబడింది...
ఇక ఇప్పుడు ఎటూ కెరీర్లో పెద్దగా సంపాదించేదేం లేదు కాబట్టి గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ కే ప్రాధాన్యం ఇస్తోంది. నాయకి అనే సినిమా కాస్త అటూ ఇటూ అయినా... నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన "కోడి" ఆమెకి మంచిపేరే తెచ్చింది...
ఇక అక్కడి నుంచి ఈ చెన్నై భామకు వచ్చే ఆఫర్స్ రూట్ మారిపోయింది. విభిన్నమైన కాన్సెప్టులు.. త్రిష ఇప్పటివరకూ టచ్ చేయని సబ్జెక్టులతో ఛాన్సులు వస్తున్నాయి. తాజాగా తనలోని కొత్త యాంగిల్ ను చూపించాలని త్రిష ఫిక్స్ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ 'గర్జనై' అనే కోలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.
తమిళనాడులోని యార్కాడ్ సమీపంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఇక్కడ బోలెడన్ని యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరించేస్తున్నారు. త్రిష మొదటిసారిగా యాక్షన్ జోనర్ ను తానే చూపిస్తుండగా.. ఇంత లేటు వయసులో ఇలాంటి ఫీట్స్ ఎందుకో అనే మాటలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.