Airasia India Offers Base Fare At Rs 99 For Domestic Travel

2017-11-13 4,601

The Malaysian Budget carrier AirAsia on Sunday announced a discount sale, offering passengers one-way base fare at Rs 99 for a domestic journey across its Indian JV airline network under a limited period offer. However, the travel period under the offer, for which the bookings commence on Sunday night, will be between May next year and January 2019, as per an airline statement.

మలేషియాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా విమాన ప్రయాణికులకు పరిమితకాలపు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. దేశీయ మార్గాల్లో ఒకవైపు ప్రయాణానికి టికెట్‌ను కేవలం రూ.99(బేస్‌ ఫేర్‌/పన్నులు, సర్‌చార్జీలు, ఫీజులు కాకుండా)కే పొందొచ్చని ఈ సంస్థ తెలిపింది.

అదే విధంగా ఇండియన్‌ జేవీ ఎయిర్‌లైన్‌ నెట్‌వర్క్‌ ద్వారా నడిచే అంతర్జాతీయ విమానాల్లో రూ.444కే(బేస్‌ఛార్జి) టికెట్‌ అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు వచ్చే ఏడాది 2018 మే నుంచి 2019 జనవరి మధ్యకాలంలో ఆయా గమ్యస్థానాల మధ్యప్రయాణించాల్సి ఉంటుందని ఎయిర్‌ ఏషియా పేర్కొంది.

రూ.99కే(బేస్‌ఛార్జీ) దేశీయ, రూ.444(బేస్‌ఛార్జీ)లకే అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణాన్ని ఆనందించండి' అని ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. ఇంటర్నేషనల్‌ ట్రిప్‌నకు వెళ్లాలనుకునేవారు కోల్‌కతాలోని జోహర్‌ బహ్రు నుంచి ప్రయాణించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపింది. ఈ విభాగంలో ఎయిర్‌ఏషియా బెర్హాద్‌ బేస్‌ ఛార్జిలను తొలగించింది. అయితే విమానానికి సంబంధించిన అన్ని పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.