Krishna River Boat Mishap : బోటు ప్రమాదానికి కారణాలివీ!

2017-11-13 7,321

At least 16 people lot life fter a boat capsized in Krishna River in Krishna district's Ibrahimpatnam Mandal. A NDRF team has begun the rescue operations. At least 10 people are feared drowned and search for missing is underway.
కృష్ణా జిల్లా లో పడవ బోల్తా పడిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా 19 మంది ని స్థానిక మత్స్యకారులు,ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. ఇబ్రహీంపట్నం ఫెర్రాఘాట్ వద్ద జరిగిన విషాధ సంఘటనకు సంబంధించి బాధితులు ఎన్నో షాకింగ్ విషయాలు చెబుతున్నారు.ప్రమాదానికి సంబంధించి విస్తుపోయే విషయాలను చెబుతూ బాధితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. బోటులో సామర్థ్యానికి మించి ఎక్కినట్లుగా తెలుస్తోంది. ఇది కూడా ప్రమాదానికి ఓ కారణంగా తెలుస్తోంది.
బాధితులు అందరూ తొలుత ఆంధ్రప్రదేశ్ టూరిజం బోటు గురించి చూశారు. కానీ ఏపీ టూరిజం బోటు అందుబాటులో లేకపోవడం లేదా సమయం మించిపోవడంతో వారంతా పక్కనే ఉన్న ప్రయివేటు బోటు ఎక్కారు.
ప్రయాణీకులు బోటు ఎక్కే ముందే ప్రయివేటు టూరిజం బోటు సిబ్బందిని లైఫ్ జాకెట్ల గురించి అడిగారు. కానీ వారు మీకు ఏం భయం లేదని, లైఫ్ జాకెట్లు అవసరం లేదని చెప్పారని బాధితులు చెప్పారు. లైఫ్ జాకెట్లు ఇవ్వలేదన్నారు. కొంతమందికి మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది.