US & South Korea Warning to North Korea : కిమ్‌కి షాకిచ్చిన అమెరికా: సంచలనం

2017-11-11 1,468

The United States and South Korea started joint naval exercises Saturday that will involve three U.S. aircraft carriers in what military officials describe as a clear warning to North Korea.

వరుస క్షిపణి ప్రయోగాలతో యుద్ధానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియాకు దక్షిణ కొరియాతో కలిసి అమెరికా దిమ్మదిరిగే షాకిచ్చింది. తాజాగా ఈ రెండు దేశాలు చేస్తున్న యుద్ధ విన్యాసాలతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హడలెత్తిపోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.
వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే అనేక సార్లు కొరియా ద్వీపంపై యుద్ధ విమానాలతో డ్రిల్‌ చేపట్టి తమ సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించింది అమెరికా. తాజాగా దక్షిణకొరియాతో కలిసి చేపట్టిన నేవీ డ్రిల్‌ సంచలనంగా మారింది.
దక్షిణకొరియా తూర్పు తీరంలో ఆ దేశంతో కలిసి అమెరికా సంయుక్త నావికాదళ విన్యాసాలు చేపట్టింది. యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రేగాన్‌, దియోడోర్‌ రూస్‌వెల్ట్‌, నిమిజ్‌ బ్యాటిల్‌ గ్రూప్‌లు విజయవంతంగా సముద్ర జలాల్లోకి వెళ్లినట్లు దక్షిణకొరియా మిలిటరీ తెలిపింది.
శనివారం నుంచి నుంచి నాలుగు రోజులపాటు ఈ డ్రిల్‌ జరుగుతుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసియాలో పర్యటిస్తున్న సమయంలో ఈ డ్రిల్‌ చేపట్టడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, గత ఆదివారం నుంచి ట్రంప్‌ ఆసియా దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే మొదట జపాన్‌, దక్షిణకొరియాల్లో పర్యటించిన ట్రంప్.. తాజాగా చైనాలో కూడా పర్యటించారు. ట్రంప్ కు చైనా ఘన స్వాగతం పలికింది. అయితే, జపాన్, దక్షిణకొరియాలు ఉత్తరకొరియా విషయంలో అమెరికాకు మద్దతు పలుకగా, చైనా మాత్రం ఏ విషయం తేల్చకపోవడం గమనార్హం.