అర్జున్‌రెడ్డి తమిళ టైటిల్‌పై వర్మ పంచ్..

2017-11-11 1,177

తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి ప్రస్తుతం తమిళంలో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా రూపొందుతున్నది. ఈ చిత్రానికి వర్మ అని టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ ప్రకటించగానే వర్మ పేరు సోషల్ మీడియాను కుదిపేసింది. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ మారి ఇంటర్నెట్‌లో సంచలనం రేపుతున్నది.
వర్మ టైటిల్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. మీడియాలో అత్యంత వివాదాస్పదుడు. సోషల్ మీడియాలో అతిగా స్పందిస్తూ కామెంట్లు పెడుతుంటాడు. అలా పాపులర్ అయిన వర్మ పేరును అర్జున్ రెడ్డి తమిళ చిత్రానికి పేరు పెట్టడం వైరల్ అయింది. దానిపై వర్మ స్పందిస్తూ
అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్ పేరు వర్మ అట. ఆ పేరు ఎక్కడో విన్నట్టు గుర్తున్నట్టు అనిపిస్తున్నట్టు ఉంది అని ఆర్జీవి తనదైన శైలిలో స్పందించారు.
నవంబర్ 10న రీలీజ్ చేసిన వర్మ ఫస్ట్‌లుక్ విశేష స్పందన వస్తున్నది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అయిపోయింది. విక్రమ్ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. యూ ఆర్ గాడ్ డామిన్ రైట్ అని ట్యాగ్ లైన్‌ను పెట్టి తన ఇన్స్‌టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశాడు.
వాస్తవానికి వర్మ టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను గురవారం చేయాల్సి ఉంది. కానీ తన చిత్రం సామీ స్క్వేర్‌కు పనిచేస్తున్న ప్రముఖ కెమెరామెన్ ప్రియన్ ఆకస్మిక మృతితో వాయిదా వేశారు. ఆ తర్వాత శుక్రవారం ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు.

Videos similaires