ప్రముఖ డైరెక్టర్‌కు షాకిచ్చిన అనుష్క.. ప్రభాసే కారణమట

2017-11-11 2,674

బాహుబలి సంచలన విజయం తర్వాత ప్రభాస్‌తోపాటు అనుష్క శెట్టికి కూడా దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ లభించింది. బాహుబలి తర్వాత ప్రభాస్, అనుష్కలను పలువురు బాలీవుడ్ ప్రముఖులు బాలీవుడ్ ఎంట్రీ కోసం అడిగారు. అందులో హిందీలో బాహుబలిని పంపిణీ చేసిన కరణ్ జోహర్ కూడా ఉన్నారు. అయితే కరణ్ జోహర్ ఆఫర్‌ను ప్రభాసే కాదు.. అనుష్క కూడా రిజెక్ట్ చేసిందనే వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రముఖంగా వినిపిస్తున్నది. అందుకు కారణం ప్రభాస్ అని జాతీయ పత్రికలు కథనాన్ని ప్రచురించాయి. అసలు ఏమి జరుగుతున్నదంటే..
బాహుబలి సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత అనుష్కను తన హిందీ చిత్రంలో నటింపజేయడానికి కరణ్ జోహర్ తీవ్రంగా ప్రయత్నించారట. తమాషా చిత్రంలో నటించాలని అనుష్కకు ఆఫర్ ఇచ్చారట. అయితే ఆ పాత్ర తనకు సూట్ కాదని ఎలాంటి మొహమాటం లేకుండా తిరస్కరించింది అని ఓ మీడియాలో కథనం వెలువడింది.
అయితే కరణ్ జోహర్ ఆఫర్‌ను తిరస్కరించడానికి ముందు తనకు అత్యంత సన్నిహితుడు ప్రభాస్‌ను సంప్రదించింది. ప్రభాస్ సూచన మేరకే అనుష్క బాలీవుడ్ ఎంట్రీని రిజెక్ట్ చేసింది అనే విషయాలను సదరు జాతీయ వెబ్‌సైట్ కథనంలో పేర్కొన్నది.
బాలీవుడ్ ఎంట్రీని రిజెక్ట్ చేసిన తతంగాన్ని చూస్తే ప్రభాస్ అడుగుజాడల్లోనే అనుష్క నడుస్తున్నట్టు కనిపిస్తున్నది. కరణ్ జోహర్ ఇచ్చిన బాలీవుడ్ ఆఫర్‌ను రెమ్యునరేషన్ కారణంగా ప్రభాస్ రిజెక్ట్ చేసినట్టు సమాచారం.