Netigen Comment On Singer Sunitha సునీత పై నెటిజన్ కామెంట్

2017-11-09 6,281

Singer Sunita has posted a beautiful pic along with her children on Facebook. Fans appreciate that you look like a sister.

తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సింగర్ సునీత. ప్రేక్షకులను మైమరిపించే గానం మాత్రమే కాదు, ఆకట్టుకునే రూపం కూడా ఆమె సొంతం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సునీతకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తాజాగా సునీత తన ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేశారు. సాధారణంగా ఎప్పుడూ చీరలో కనిపించే ఆమె ఈ ఫోటోలో జీన్స్, టాప్ వేసుకుని దర్శనమిచ్చారు. ఈ ఫోటోపై అభిమానుల నుండి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
ఈ ఫోటోలో మీ పక్కన ఉన్న ఇద్దరు మీ పిల్లలు అంటే నమ్మలేక పోతున్నాం. మీరు వారికి తల్లిలా లేరు, సోదరిలా ఉన్నారు అంటూ కొందరు అభిమానులు ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ సునీత. సాంప్రదాయ చీరకట్టులో ఆమె చూపరులను ఆకట్టుకున్నారు.
నాకు సంప్రదాయ దుస్తులు ధరించడం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా జూట్ కాటన్ సారీస్ అంటే ఎంతో ఇష్టం. ఎవరినీ ఇంప్రెస్ చేయాలని మాత్రం కాదు, కంఫర్ట్‌గా ఉండటంతో పాటు స్టైల్‌గా ఉంటాయి కాబట్టే నేను ఎక్కువగా సారీస్ కడతాను అని సింగర్ సునీత పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.