Renu Desai Re-Entry In Movies మళ్ళీ తెరమీదకి రేణూ దేశాయ్

2017-11-09 1,068

According to sources Pawan Kalyan’s ex wife Renu Desai is making her re entry into Movies. Not that she is starring in a telugu film but she is planning to Enter with Malayali movies.

"బద్రి" మూవీతో టాలివుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రేణూదేశాయ్ ఆ తర్వాత 'జానీ'లో నటించింది. పవన్‌కల్యాణ్‌ను పెళ్లి చేసుకుంది. పవన్‌తో బ్రేకప్ తర్వాత ఆమె తన పిల్లలతో కలిసి ఉంటోంది. అయితే పవర్‌స్టార్‌తో మ్యారేజ్ తర్వాత రేణూదేశాయ్ నటిగా ఎక్కడా కనిపించలేదు. ఆమె హీరోయిన్‌గా చేసింది మూడు సినిమాలే. చాలా గ్యాఫ్ తర్వాత బుల్లితెరపై కనిపిస్తోంది.
మామూలుగానే రేణూ ఎమోషనల్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది. ఇదే ఆమె షోపై ఉత్కంఠ రేపడానికి కారణమవుతోంది. పవన్‌తో రిలేషన్ గురించి రేణూ దేశాయ్ ఎక్కడా నెగిటివ్‌గా మాట్లాడలేదు. బ్రేకప్ తర్వాత కూడా ఆమె ఎక్కడా నోరు మెదపలేదు.
పవన్ కళ్యాణ్ తో డివోర్స్ తర్వాత టాలీవుడ్ కు దూరమైంది రేణు దేశాయ్. రీసెంట్ గా మంగలాష్టక్ అనే మరాఠి సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన రేణు.. ఇప్పుడు ఇష్క్ వాలా లవ్ తో డైరెక్టర్ గా ఆ తర్వాత నీతోనే డాన్స్ అనే షో కి జడ్జ్ గా చేయటానికి ఒప్పుకుందనగానే పవన్ కళ్యాణ్ కాస్త ఇబ్బంది పడ్డారు.
గతంలోనూ పవన్‌కు సంబంధించిన విషయాలను చెబుతున్నట్లే మాట్లాడి.. చివరకు అంతా కూల్‌గానే ఉంచేది. మరి టీవీ షోలు ఎమోషన్స్‌ను బయటపెడుతుందా లేదా అన్న అనుమానం తో చూసారు గానీ రేణు ఆ షోలో హుందాగానే ఉంటోంది. అయితే ఇప్పుడు వచ్చిన వార్త మాత్రం కాస్త వింతగానే ఉంది.