బిత్తిరి సత్తి ఇక కనిపించడా??? సత్తి రాజీనామా..!

2017-11-09 4,073

According to sources, Bithiri Sathi alias Ravi has tendered resignation for the V6 news channel. He became popular in Telugu states with Teenmar programme.

తనదైన శైలిలో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, 'తీన్ మార్' ప్రోగ్రామ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బిత్తిరి సత్తి అలియాస్ రవి, తాను మొదటి నుంచి పని చేస్తున్న చానల్ కు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. బుల్లితెరపై బిత్తిరి సత్తిగా అందరికీ సుపరిచితమైన సత్తి అసలు పేరు చేవేళ్ల రవి.
రంగారెడ్డి జిల్లా పమేనా గ్రామానికి చెందిన వాడు. చిన్నతనం నుండి ప్రముఖులను ఇమేట్ చేస్తూ అందరినీ ఎంటర్టెన్ చేసేవాడు. అతనిలోని ఆ టాలెంటే ఇపుడు అతన్ని పెద్ద సెలబ్రిటీ చేసింది.. తనదైన శైలిలో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ‘తీన్ మార్' ప్రోగ్రామ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బిత్తిరి సత్తి తాను మొదటి నుంచి పని చేస్తున్న చానల్ కు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది..
నిన్న తీన్మార్ కార్యక్రమంలో కూడా బిత్తిరి సత్తి కనిపించలేదు.. దీంతో ఈ అనుమానం మరింత బలపడింది.. అసలు బిత్తిరి సత్తి ఛానల్ నుండి వెళ్లిపోవడానికి కారణం ఏంటి..? చానల్ వర్గాలువెల్లడించిన వివరాల మేరకు, సత్తికి పాప్యులారిటీ పెరుగుతూ ఉండటంతో, ప్రైవేటు కార్యక్రమాలు చేసుకోవడానికీ మేనేజ్ మెంట్ అనుమతిచ్చింది.
సత్తి ప్రైవేటు షూటింగ్ లకు కూడా సంస్థ కెమెరాలను తీసుకువెళుతుంటే ఏమీ అనలేదు. ఇక ఇటీవలి కాలంలో చాన్సులు పెరగడం, మరిన్ని ప్రోగ్రామ్ లకు అవకాశాలు రావడం, ఉదయభాను వంటి టాప్ యాంకర్ తో స్టేజ్ పంచుకునే అవకాశం లభించడంతో, సత్తిలోని మరో యాంగిల్ బయటకు వచ్చిందట.

Free Traffic Exchange