Ace comedian turned hero Sunil's dry patch is reportedly getting worse. After delivering a spate of unsuccessful films, he has now lost out on two potential remakes.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్.... ఆ తర్వాత హీరోగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. మొదట్లో సునీల్ హీరోగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించాయి, కొన్ని హిట్టయ్యాయి. అయితే సక్సెస్ రేటు తగ్గడంతో సునీల్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల జోలికి పోకుండా కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీని నమ్ముకుని రోటీన్ సినిమాలు తీస్తుండటంతో సునీల్ వరుస ప్లాపులు చవిచూడాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో సునీల్‌కు చెప్పుకోవడానికి ఒక్క హిట్ట కూడా లేదు. దీంతో సునీల్ మార్కెట్ డౌన్ అయిందని ట్రేడ్ వర్గాల టాక్.
సునీల్ నటించిన చివరి చిత్రం ‘ఉంగరాల రాంబాబు'. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నిరాశ మిగిల్చింది. ఈ ఫలితంతో సునీల్ కెరీర్ ఇబ్బందుల్లో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
‘ఉంగరాల రాంబాబు' సినిమా తర్వాత సునీల్ రెండు ప్రాజెక్టులు కమిట్ అయ్యారు. అయితే ఆ రెండు ప్రాజెక్టులు ఇపుడు సునీల్ చేజారి పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళంలో హిట్టయిన ‘సతురంగ వెట్టై' చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను ఆయన సునీల్ హీరోగా చేయాలనుకున్నారు. అయితే ఇపుడు సనీల్ మార్కెట్ డౌన్ కావడంతో... ఆయనకు బదులు వేరే హీరోతో చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.