YSRCP Chief YS Jagan Mohan Reddy's Praja Sankalpa Yatra has reached the second day on Tuesday. Starting off from Vempalli outskirts at 9 AM, YS Jagan spoke to all the local residents and party activists who came in his support and began the Padayatra.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పారడైజ్ పేపర్ లీక్ అంశంపై స్పందించారు. ఆయన ప్రజా సంకల్ప యాత్ర మూడో రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. తనకు విదేశాల్లో ఆస్తులు ఉన్నట్లు నిరూపించాలని అధికార పార్టీని నిలదీశారు.
సీఎం చంద్రబాబుకు తాను పదిహేనురోజుల సమయం ఇస్తున్నానని జగన్ చెప్పారు. తనకు విదేశాల్లో ఆస్తులు ఉన్నట్లుగా నిరూపించాలని సవాల్ చేశారు. విదేశాల్లో ఒక్క పైసా అయినా తనకు ఉన్నట్లు నిరూపించాలన్నారు. ఆ దమ్ము బాబుకు ఉందా అన్నారు.