Kajal Agarwal and Tamannah Refuse offer in Movie, Which is going to Directed by teja with Venkatesh Daggubati.
గత కొద్ది రోజులుగా ఇంతకు ముందు ఎప్పుడూ లేని సమస్య వచ్చి పడింది. అదే తెలుగు హీరోలకి హీరోయిన్ల కొరత. చిరంజీవీ, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల సినిమా మొదలైన ప్రతీసారి ఇదే సమస్య ఎదురవుతోంది.వీరి సరసన ఇప్పటికి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకునే స్థాయిలో ఉన్నది అయితే అనుష్క, లేదా నయన తార.
మిగతా హీరోయిన్లంతా ఈ అగ్ర హీరోల పక్కన చేయటానికి వెనకడుగు వేస్తున్నారు. వీళ్ళ భయమంతా ఇలా పెద్దనటుల పక్కన చేస్తే మళ్ళీ కుర్ర హీరోల పక్కన చాన్స్ రాదేమో అని. అయితే ఇదే సమస్య నయన్ కి గానీ అనుష్కకి గానీ లేదు వీళ్ళు పెద్దా చిన్న అనికాకుండా ఎవరి పక్కనైనా ఇట్టే సూటైపోతారు.
ఒక కథరాసుకునేటప్పుడే ఎవరైతే బావుంటారన్న ఒక ఐడియాతో అన్నీ సిద్దం చేసుకున్నాక సరిగ్గా వాళ్ళు ఉంటేనే కథకి న్యాయం జరుగుతుంది. పక్కాగా అలా పాత్రలని డిజైన్ చేసుకున్నాకే "నేనే రాజు నేనే మంత్రి" లాంటి సినిమా తో హిట్ కొట్టాడు తేజా. ఒకరకంగా ఆ సినిమా తేజా కి డైరెక్టర్ గా కమ్ బ్యాక్ సినిమా అయ్యింది.