PM Modi's Notes Ban After A Year : What's Changed

2017-11-07 1

On November 8 last year, the Modi government demonetised Rs 500 and Rs 1,000 notes as part of its drive against black money, counterfeit notes and corruption. For the banking sector, I would consider it positive as lots of money has come into the formal banking system.
పెద్ద నగదు నోట్లను రద్దు చేసి నవంబర్ 8వ, తేదికి ఏడాది పూర్తికానుంది. నోట్లరద్దు వల్ల దేశానికి పెద్దగా ప్రయోజనం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల తమకు ప్రయోజనం కలిగిందని బ్యాంకులు ప్రకటించాయి. గత ఏడాది నవంబర్ 8వ, తేదిన పెద్ద నోట్ల నగదును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని విపక్షాలు ఆ సమయంలోనే తప్పుబట్టాయి.పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్యులు తీవ్రంగా ఇక్కట్లపాలయ్యారు.అయితే అదే సమయంలో దేశాభివృద్ది కోసమే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
నోట్ల రద్దు కారణంగా బ్యాంకులకు ప్రయోజనం కలిగిందని భ్యాంకర్లు ప్రకటించాయి. పెద్ద నోట్ల రద్దు తమకు మంచే చేసిందని చెప్పారు.డిపాజిట్లు భారీగా పెరుగడంతో పాటు డిజిటలైజేషన్‌ చాలా వేగవంతంగా విస్తరించేలా చేసిందని బ్యాంకర్లు అభిప్రాయం వ్యక్తంచేశారు.