Karthi Shared His Personal And Professional Matters To Media

2017-11-06 2,517

Actor Karthi said it is the blessings of Telugu people who accepted him. In an interview with RK, the actor has admitted that he is a quick learner which helped him to learn the Telugu language.
త్వరలో 'ఖాకీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కార్తి ఇటీవల ఆర్కే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించడం ఆనందంగా ఉందని, మా పక్కింట్లో నూతన ప్రసాద్ గారు ఉండేవారు. వారి ఇంటి నుండి ఎప్పుడూ తెలుగు పదాలు వినేవాడిని. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ సమయంలో కూడా ఎక్కువ తెలుగు వినేవాడిని, ఆ విధంగా తాను తెలుగు త్వరగా నేర్చుకున్నానని కార్తి తెలిపారు.
అన్నయ్య సూర్యను తాను ఒక సినిమాల విషయంలో తప్ప మరే విషయంలోనూ ఫాలో కాలేదని, తమ ఇద్దరి అభిరుచులు వేరని, విభిన్నమైన క్యారెక్టర్లు అని కార్తి చెప్పుకొచ్చారు. చిన్నతనం నుండి ఇద్దరికీ ఏ విషయంలోనూ అసలు పడేది కాదని కార్తి తెలిపారు.
చిన్నప్పటి నుండి ఇద్దరి మధ్య ప్రతి విషయంలో గొడవ జరిగేది.

Free Traffic Exchange