Paradise Papers Leak : 714 Indian Names, ప్యారడైజ్ పేపర్స్ లీక్ సంచలనం ?

2017-11-06 7,245

Financial data leaked from two companies with tax havens across the world has revealed the hidden wealth of the rich and powerful, including from India
భారత్ లోని నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పనామా పేపర్స్ లీక్ ఇంకా మరిచిపోకముందే మరో లీక్ కలకలం రేపుతోంది. ప్యారడైజ్ పేపర్స్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగ్గొట్టిన నల్లకుబేరుల జాబితా ఒకటి బయటపడింది. ఇందులో 180 దేశాలకు చెందిన బడాబాబుల డేటా లీకవగా.. అందులో భారత్ నుంచి 714మంది ఉండటం గమనార్హం. లీకైన డేటా పరంగా భారత్ 19వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లీకేజీ వెనుక ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 13.4 మిలియన్ పేపర్లను లీక్ చేసినట్టు సమాచారం. గతంలో పనామా పేపర్స్‌ను లీక్ చేసింది కూడా ఐసీఐజే నే కావడం గమనార్హం. పన్నుల నుంచి తప్పించుకునేందుకు బడా బాబులు, కంపెనీలు తమ ఆస్తులను ఎలా దాచుకున్నదీ ఈ పేపర్లలో విపులంగా ఉంది. పేపర్ల లీకేజీపై స్పందించిన 'అప్లెబీ' తమ సమాచారం అపహరణకు గురైందని, అయితే తమ వద్ద ఎటువంటి అవకతవకలు జరగలేని స్పష్టం చేసింది.