The International Cricket Council today gave a clean chit to India skipper Virat Kohli who was seen using a walkie talkie during the first T20 International against New Zealand in Delhi.
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కివీస్‌పై పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.
అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. డగౌట్‌లో జట్టు సభ్యులతో కూర్చున్న కోహ్లీ వాకీ టాకీలో మాట్లాడుతూ కనిపించాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా కోహ్లీ ప్రవర్తించాడంటూ నెటిజన్లు మండిపడ్డారు.