Virat Kohli and Rohit Sharma shared a 230-run stand for the second wicket. The stand saw Rohit’s effortless batting, Kohli’s drive through covers and acceleration that took India’s total past 200 before the 40th over.
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని తాను ఎంతో ఎంజాయ్ చేస్తానని, అతడు కొట్టే షాట్లను అవతలి ఎండ్ నుంచి చూసేందుకు ఇష్టపడతానని విరాట్ కోహ్లీ అన్నాడు. కాన్పూర్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 230 పరుగులు జోడించారు. సిరిస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌లో వీరిద్దరూ రాణించగా, చివరి ఓవర్‌లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ చేయడంతో మూడో వన్డేలో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్ శర్మలు పలు రికార్డును నమోదు చేశారు.