యాంకర్ ప్రదీప్ పెళ్లి హాట్ టాపిక్! కోట్ల కట్నంతో పాటు హైదరాబాద్ లో ఖరీదైన ఫ్లాటు

2017-10-29 1,595

Anchor Pradeep Machiraju is an eligible bachelor in Telugu small screen anchors. He got stardom through his skills with class and intelligent comedy. it is learned that Pradeep got a marriage proposal from Visakhapatnam.

ఈవెంట్ మేనేజర్ గా కెరీర్ మొదలు పెట్టి, ఆ పై రేడియో జాకీగా, ఇపుడు బుల్లితెర యాంకర్ గా దూసుకెలుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో మోస్ట్ పాపులర్ మేల్ యాంకర్ అయిన ప్రదీప్ సంపాదనలో కూడా టాప్‌లో ఉన్నాడు. చూడటానికి ఆకట్టుకునే రూపం, మంచి మాటకారి అయిన ప్రదీప్‌కు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో మోస్ట్ ఎలిజబుల్ యాంకర్‌గా ఉన్న ప్రదీప్‌కు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయని, కొందరు తమ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కోట్లలో కట్నం ఇస్తాంటూ ఆఫర్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ప్రదీప్ సమాజిక వర్గానికే చెందిన విశాఖ రియల్టర్ ఒకరు ప్రదీప్‌ను తన అల్లుడిగా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆయనకు విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో భారీగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.