Balakrishna's 102 movie photos leaked in media

2017-10-29 9,097

Balakrishna's 102 movie is Jai Simha. This movie is producing by C Kalyan. Jai Simha movie is going at Vizag beach Road. Few of the photos are leaked in media goes viral in Social media. This movie first look is releasing on November 1st.

ఈ ఫొటో చూసి నటసింహ బాలయ్య దాడి చేస్తున్నారనుకొంటే పొరపాటు పడినట్టే.. జై సింహ చిత్ర షూటింగ్‌లో భాగంగా బాలయ్య నటిస్తున్న ఓ సీన్‌లో ఓ భాగం. పైసా వసూల్ వసూలు తర్వాత బాలయ్య.. 102 చిత్రంతో మరోసారి సంక్రాంతి బరిలో దూకారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ చిత్రానికి చెందిన కొన్ని ఫోటోలు మీడియాలో హల్‌చల్ రేపుతున్నాయి.

ప్రముఖ నిర్మాత చిల్లర కళ్యాణ్ సీకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 102వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్‌లో 5 వేల జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో బాలయ్య నిర్వహించే మహాధర్నా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లోనే బాలకృష్ణ, హీరోయిన్ హరిప్రియపై ఓ పాటను చిత్రీకరించనున్నారు. అలాగే బాలయ్యపై ఓ మాంటేజ్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు.
బాలయ్య 102 చిత్రానికి చిత్రానికి "జై సింహా" అనే టైటిల్‌ ఖరారు చేశాం. బాలయ్య కెరీర్‌లో సింహా అనే టైటిల్స్‌తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు.