శకలక శంకర్ హీరోగా ‘డ్రైవర్ రాముడు’..ఫస్ట్ లుక్ సూపర్..

2017-10-26 595

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయమైన శకలక శంకర్ తర్వాత సినిమాల్లో కమెడియన్‌గా రాణిస్తూ వరుస అవకాశాలతో దూసుకెలుతున్నాడు. తాజాగా శకలక శంకర్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి 'డ్రైవర్ రాముడు' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. రాజ్ స‌త్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ పతాకం పై మాస్టర్ రాజ్ ప్రణవ్ తేజ్ సమర్పణలో ఎమ్ ఎల్ రాజు, ఎస్ ఆర్ కిషన్ నిర్మిస్తున్నారు. పోస్టర్ కట్టుకునే విధంగా ఉండటంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ... ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించిన శంక‌ర్‌లో మ‌రో కొత్త కొణం ఈచిత్రం ద్వారా చూపించబోతున్నాం. శంక‌ర్ మార్క్ కామెడీ ఉంటూనే ఈ చిత్ర కథ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది అని తెలిపారు.