రేవంత్‌రెడ్డిని పదవుల నుండి తొలగిస్తున్నారా?TDLP &పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆదేశం|Oneindia

2017-10-25 1

TDP president L. Ramana ordered Revanth Reddy don't conduct TDLP meeting on Oct 26. L. Ramana wrote a letter Chandrababu naidu to remove party posts from Revanth Reddy.
టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి ఆ పార్టీ నాయకత్వం షాకిచ్చింది. అక్టోబర్ 26వ, తేదిన పార్టీ శాసనసభపక్ష సమావేశంతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ రేవంత్‌రెడ్డిని ఆదేశించారు.అంతేకాదు వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభపక్షనేత పదవుల నుండి రేవంత్‌రెడ్డిని తొలగించాలని చంద్రబాబుకు ఎల్. రమణ లేఖ రాశారు.
తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై ఆ పార్టీ నాయకత్వం కొరడా ఝుళిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్‌రెడ్డి వెళ్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో పార్టీ నాయకత్వం రేవంత్‌పై చర్యలకు ఉపక్రమిస్తోంది.

Videos similaires