సమాజం లోని అసాంఘిక శక్తుల కట్టడిలో భాగంగా కరీంనగర్ జిల్లా... పోలీస్ కమిషనరేట్‌గా ఏర్పడిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో రాజధానితో పోటీ పడుతున్నది. కమిషనరేట్ పరిధిలో 10వేల సీసీ కెమెరాల ఏర్పాటుతో నేర నియంత్రణ కోసం సాగుతున్న పోలీస్‌శాఖ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. దాని పేరే డ్రోన్. గగన తలంలో విహారిస్తూ ఎక్కడ ఏం జరుగుతుందో అరచేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో చూపిస్తుంది ఈ డ్రోన్. అయితే సుమారు లక్షా50వేలతో కొనుగోలు చేసిన ఈ అత్యాధునిక ఫ్లెయింగ్ కెమెరా, రెండ్రోజుల క్రితం నుంచే శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగమైం ది. కమిషనరేట్ కేంద్రంలోని కార్యాలయంలో కూర్చుని డ్రోన్‌ను ప్రయోగించవచ్చు. సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. 500 మీటర్ల ఎత్తు వరకు ఎగురుతుంది అలగే ఈ డ్రోన్ పూర్తిస్థాయి క్లారిటితో ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌కు కూడా అనుసంధానం చేసి మనం ఉన్న చోటే నుంచి డ్రోన్‌ను వినియోగించి సమాచారం తెలుసుకోవచ్చు. అసాంఘిక శక్తుల ఆట కట్టించడమే కాక నగరంలోని ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు అని అధికారులు తెలిపారు.