Two youngsters riding a high-end bike and lost life after their two wheeler rammed into the road divider in Vijayawada.
అర్థరాత్రి పార్టీలు.. బైక్‌ల మీద షికార్లు.. యువత ప్రాణాల మీదకు తెస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల మీద ఎంత అవగాహన కల్పిస్తున్నా.. యువతకు మాత్రం తలకెక్కట్లేదు. తాజాగా విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదం మరోసారి ఈ అంశాన్ని చర్చనీయాంశం చేసింది. మద్యం మత్తులో అతివేగంతో బైక్ నడిపిన విద్యార్థులు.. డివైడర్ ను ఢీకొట్టి ప్రాణాలు విడిచారు. స్నేహితుడు ఇచ్చిన పార్టీకి వెళ్లి.. ఆదివారం తెల్లవారుజామున బైక్ తో రోడ్డెక్కారు. మత్తులో ఉండటంతో వేగం హద్దులు దాటింది. అంతే వేగంగా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.