On Thursday, Shobha joined Telugu Desam Party in the presence of minister Nakka Anand Babu, claiming that she was attracted by the developmental programmes being taken up by the Chandrababu Naidu government.After staying away from politics for several years post the merger of PRP with Congress, Shobha Rani has now joined Telugu Desam Party.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన శోభారాణి తెలుగుదేశం పార్టీలో చేరారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో మహిళా విబాగమైన మహిళా రాజ్యం రాష్ట్ర అధ్యక్షురాలిగా శోభారాణి వ్యవహరించారు.ఇప్పుడు ఆ శోభారాణి తిరిగి సొంతగూడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి నక్కా ఆనందబాబు సమక్షంలో ఆమె పచ్చ కండువా కప్పుకున్నారు. ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు టిడిపి నుంచి ఆ పార్టీలోకి చేరిన శోభారాణి, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.