Muslims across India celebrated the Id-ul-Zuha, one of the two most important festivals of the Islamic calendar. Prime Minister Narendra Modi also greeted the nation and wished for harmony and brotherhood in the society.
ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో రెండోది ఈద్-ఉల్-జుహా(బక్రీద్). దైవప్రవక్త అజ్రత్ ఇబ్రహాం త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే ఈద్-ఉల్-జుహా (బక్రీద్) పండుగ సందర్భంగా దేశంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ మోది శుభాకాంక్షలు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈద్ ముబారక్ సంబరాలు జరుగుతున్నాయి. ఈ బక్రీద్ పండుగను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు సైతం ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. క్షమను, త్యాగాన్ని గుర్తు చేస్తూ స్వార్థాన్ని త్యజించాలన్న సందేశాన్నిచ్చేదిగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు.