Fidaa’s Overseas Share Stands At 7 Crores

2017-08-31 162

After expenses deduction, Fidaa’s overseas share stands at 7 Crores. As the movie was sold for 4 crores , it has fetched 3 crores profit. Out of the profits, 1.25 Crores went to the distributor , remaining 1.75 crores to the local exhibitors as per the profit sharing model.

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బ్లాక్ బస్టర్లలో ఫిదా కూడా ఒకటి, యుఎస్‌లో రెండు మిలియన్‌ డాలర్లకి పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమావల్ల లాభం ఎంతొచ్చిందన్నలెక్కలు చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతాయ్. అంతేకాదు మా సినిమా ఇంత గ్రాస్ కలెక్ట్ చేసిందీ అని చెప్పుకునే లెక్కల వెనుక ఉండే అసలు మతలబు తెలిసిపోతుంది. సినిమా డిస్ట్రిబ్యూషన్ అనే ఒక జూదం లో రోడ్డున పడేదాకా వచ్చిన వళ్ళ భాద ఏమిటో అర్థమౌతుంది. ఆ ఫీల్డ్ లోఉన్నవాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ని గుర్రం పందాలతోనూ.., లాటరీ టికెట్ లాంటి వ్యవహారం తోనూ పోల్చుతూంటారు
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, సాయిపల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం "ఫిదా". ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫలితంగా హైయ్యెస్ట్ గ్రాసింగ్ టాప్-10 జాబితాలో "ఫిదా" చేరిపోయింది. ముఖ్యంగా సీనియర్ హీరోలు బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" వంటి చిత్రాలను వెనక్కినెట్టేయడం గమనార్హం.

Free Traffic Exchange