The deadline to link your PAN (Permanent Account Number) and Aadhaar is, as of now, on August 31. However, the Finance Ministry will decide on whether the deadline should be extended, sources told PTI.In order to check whether your Aadhaar is linked with PAN or not, you can simply login into your account on the income tax department's e-filing website - https://incometaxindiaefiling.gov.in/
పాన్‌తో ఆధార్ అనుసంధానం గడువును పొడిగించే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు నిర్ణయం తీసుకోనుంది. కాగా, ప్రస్తుత గడువు గురురవారం (ఆగస్టు 31)తో ముగుస్తోంది. అయితే, ప్యాన్, ఆధార్ అనుసంధానం ఈ ఏడాది చివరి వరకూ పొడిగించే అవకాశముంది. ప్రస్తుతం ‘ఆధార్ అనుసంధానం' అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై నవంబరులో విచారణ చేపడతామని సుప్రీం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి గడువును డిసెంబరు ఆఖరు ప్రభుత్వం పొడిగించింది.