Young India spinner Kuldeep Yadav feels former India captain MS Dhoni, who will be featuring his in 300th ODI on Thursday (August 31), judges his bowling better than anyone. The left-arm leg-spinner from Kanpur had to sit outside in the first three ODIs against Sri Lanka, but with the series already won, he is expected to get a place in the playing eleven as skipper Virat Kohli has already signalled at testing the bench strength.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లాగా తన బౌలింగ్‌ను ఎవరూ జడ్జ్ చేయలేరని యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 31 (గురువారం) నాలుగో వన్డే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ధోని తన లాంటి యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడని కుల్దీప్ కొనియాడాడు. గత ఆరు నెలలుగా ధోనితో తరచూ మాట్లాడుతన్నానని, తన ఆటతీరు మెరుగు పర్చుకోవడానికి అమూల్యమైన సలహాలు ఇచ్చాడని చెప్పాడు.