Andhra Pradesh Chief Minister and TDP leaderon wednesday ordered party mlas and ministers to visit Nandyal on friday.
దాదాపు నెల రోజుల పాటు తమ తమ నియోజకవర్గాలకు దూరంగా ఉన్నామని పలువురు టిడిపి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్నారు.
దానికి ఆయన స్పందిస్తూ.. మీ నియోజకవర్గం ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని, శుక్రవారం నంద్యాల వెళ్లాలని సూచించారు. ఉపఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. చంద్రబాబు నాయుడు బుధవారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాలలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో జాబితా సిద్ధం చేసి తనకు అందించాలని నాయకులను ఆదేశించారు.