జగన్‌కు నంద్యాల చిక్కులు : మరో 15 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి జంప్

2017-08-30 138

YSR Congress party president YS Jagan face further trouble in Andhra Pradesh with Nandyal defeat.
నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటమితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మరిన్ని చిక్కులు ఎదుర్కోబోతున్నారు. అప్పుడే తెలుగుదేశం పార్టీ ఆయనపై మైండ్ గేమ్‌ను ప్రారంభించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే 20 మంది వైసిపి ఎమ్మెల్యేలను లాక్కున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత మంది ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న సంకేతాలను ఇస్తున్నారు. టిడిపి నాయకుడు జూపూడి ప్రభాకర రావు మాటలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి.