Chandrababu Naidu And Allu Sirish Tweets Goes Crazy

2017-08-03 1

One might wonder why Andhra Pradesh Chief Minister will reply to Allu Sirish, but an interesting thing happened on the micro-blogging site Twitter, which has stunned everyone including the Allu hero.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు టాలీవుడ్‌ హీరో అల్లు శిరీష్‌ మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రెండు రోజుల క్రితం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ భేటీ అయిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా పవన్‌ను ప్రశంసిస్తూ.. చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి పవన్‌ చొరవ తీసుకోవడం అభినందనీయమని అన్నారు. దీనికి అల్లు శిరీష్‌ స్పందిస్తూ.. 'నాయకులు రాజకీయాలకు అతీతంగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది. దేశమే ముందు' అని ట్వీట్‌ చేశారు