The International Cricket Council (ICC) today (July 24) announced the Team of the ICC Women's World Cup 2017 with India's Mithali Raj as its captain.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2017 ఐసీసీ మహిళా వరల్డ్ కప్ జట్టు కెప్టెన్‌గా ఆమెను ఐసీసీ ఎంపిక చేసింది. ఆదివారంతో ముగిసిన ఈ టోర్నీలో భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ వరల్డ్ కప్‌లో 34 ఏళ్ల మిథాలీ రాజ్ జట్టుని సమర్ధవంతంగా నడిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ మిథాలీకి ఈ గొప్ప గౌరవాన్ని కట్టబెట్టింది