Ravi Teja's Touch Chesi Chudu is an upcoming 2017 Telugu film written by Vakkantham Vamsi and directed by Vikram Sirikonda.
రవితేజ టచ్ చేసి చూడు మేకింగ్ వీడియో..
'మాస్ మహారాజా' రవితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం `టచ్ చేసి చూడు`. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేబీ భవ్య సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా లావణ్య త్రిపాఠి కథానాయికలు. ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం (ఫిబ్రవరి 3) హైదరాబాద్‌లో జరిగింది. హీరో రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాతల్లో ఒకరైన వల్లభనేని వంశీ మోహన్ క్లాప్ ఇవ్వగా, సీనియర్ ఎడిటర్ గౌతంరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.