After the match with Sri Lanka Sarfaraz came to the press conference. His heart was rotten. All the reporters were English. This was clearly heard in the video asking the PR writer.
చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ సెమీఫైనల్ చేరినా ఆ టీమ్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కు కష్టాలు మాత్రం తీరలేదు. శ్రీలంకతో మ్యాచ్ లో చివరిదాకా క్రీజులో ఉండి పాక్ ను గెలిపించిన సర్ఫరాజ్ కు కష్టాలేంటి అనేగా మీ డౌట్. అతనికి వచ్చిన కష్టం ఫీల్డ్ లోపల కాదు.. ఫీల్డ్ బయట. అది భాషతో వచ్చిన కష్టం. ఆడుతున్నది ఇంగ్లండ్ లో కదా.. ఎటు చూసినా ఇంగ్లిషే. కానీ మనోడి ఇంగ్లిష్ అంతంత మాత్రమే. మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రెజెంటేషన్ సెర్మనీలో ఏం మాట్లాడాలో అన్న టెన్షన్. తాజాగా ఈ విషయం బయటపడింది.