India skipper Virat Kohli has reclaimed the top spot in batting, while Australian pacer Josh Hazlewood has achieved the number-one position in the bowlers' rankings for the first time in his career in the latest ICC ODI Player Rankings.
మంగళవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి నెంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 862 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలతో జరిగిన వన్డేల్లో అర్ధ సెంచరీలు చేసిన కోహ్లీ 22 పాయింట్లను సాధించాడు. దీంతో ఇప్పటివరకు నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ను వెనక్కు నెట్టాడు.