The massive fire has engulfed the Grenfell Tower in North Kensington from the 2nd storey to the top floor, the London Fire Brigade has tweeted.
ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లండన్ లోని ఎత్తైన భవనాల్లో ఒకటిగా పేరొందిన గ్రీన్ ఫెల్ టవర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లండన్, వెస్ట్ ఎస్టేట్ లోని 27 అంతస్తుల గ్రెన్ ఫెల్ టవర్ మొత్తం అగ్నికి ఆహుతికాగా, ఈ భవంతి ఎప్పుడైనా కూలిపోవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎగసి పడుతున్న మంటలు అదుపులోకి రాకపోగా, పక్కనున్న భవనాలకు కూడా వ్యాపించాయి. గత అర్థరాత్రి 1.16 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగగా, 1974లో నిర్మించిన టవర్ లోని 120 ఫ్లాట్ లన్నీ మంటల్లో దగ్ధమయ్యాయి.